హల్లేలూయా యని పాడి
Hallelooyaa Yani Paadi
హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||
పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.