TG-3440
Telugu

హల్లెలుయా పాడెదా

Hallelujah Paadedaa

19
views
పల్లవి

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

1వ చరణం

వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

2వ చరణం

ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

3వ చరణం

కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.