హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా
halleluuya nee kalleluuya challamgaa
పల్లవి
హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు ||హల్లెలూయ నీ||
1వ చరణం
ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ దప్పించు మయ్యా ||హల్లెలూయ నీ||
2వ చరణం
పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును సన్నుతింతుము ||హల్లెలూయ నీ||
3వ చరణం
వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ యందు నిల్పుమా ||హల్లెలూయ నీ||
4వ చరణం
ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను వే డుకొందుము ||హల్లెలూయ నీ||