TG-208
Telugu

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును

harssamee yenthoo harssamee kreesthunu

214
views
పల్లవి

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే యెంతో||

1వ చరణం

ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే యెంతో||

2వ చరణం

మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే యెంతో||

3వ చరణం

పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే యెంతో||

4వ చరణం

ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే యెంతో||

5వ చరణం

సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే యెంతో||

6వ చరణం

నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే యెంతో||

7వ చరణం

కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే యెంతో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.