హీనమైన బ్రతుకు నాది
heenamaina brathuku naadi
🎵 TG-2387🌐 Telugu
పల్లవి
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) దాపు జేరితిని శరణు కోరితిని దిక్కు నీవే నాకు ఇలలో లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||
1వ చరణం
మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత కరుణించి నన్ను కష్టాలు బాపు కరుణామయా క్రీస్తేసువా తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ పాపి కొరకు ప్రాణమర్పించిన త్యాగ శీలివి నీకే స్తోత్రము నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు వెరువను జడియను నీ కంటి పాపను నను కాచే దైవమా