TG-3444
Telugu

హే ప్రభుయేసు హే

Hey Prabhu Yesu

0
views
పల్లవి

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు||

1వ చరణం

శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||

2వ చరణం

తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా||

3వ చరణం

మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా||

4వ చరణం

పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా (2) మలమల మాడిన మానవ హృదయము (2) కలకలలాడె కదా ||సిల్వధరా||

5వ చరణం

కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత (2) మానవ మైత్రిని సిల్వ పతాకము (2) దానము జేసెగదా ||సిల్వ ధరా||

6వ చరణం

దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా (2) దేవునితో సఖ్యంబును జగతికి (2) యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||

7వ చరణం

పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా (2) దాపున జేరి పాపిని బ్రోచిన (2) కాపరి వీవెగదా ||సిల్వ ధరా||

8వ చరణం

ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా (2) ఖలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా ||సిల్వ ధరా||

9వ చరణం

కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా (2) కలుష ఎడారిలో కలువలు పూయుట (2) సిలువ విజయము గదా ||సిల్వ ధరా||