♪♫
TG-5803
Telugu
హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం
Hrudayaarpanan Seevaarpanan Thrithvaika Deevunaku Sthuthi Arpanan
17
views
పల్లవి
హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియ అర్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా (2) దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్ధన ఆలించుమయా ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా నేను చేసిన మ్రొక్కుబడులను (2) నీ ప్రేమతో స్వీకరించుమా మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయా జెకరియా అర్పించిన ధూప దీప అర్పణగా నా బలిని చేకొనుమయా ఆత్మానుసారం నడిపించుమా (2) నీ మహిమలో నన్ను చేర్చుమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.