ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం
idee kadaa jeevitam - nee daree sadaa saantvanam
ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం ఏ కాలమైనా - కారు మేఘమైనా ఏ లోయలైనా - శోక సంద్రమైనా నీవేగా ఆధారం - నీవే కదా మార్గం ||ఇదే కదా||
మరువలేని - గాయమైన నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా విసిగివున్న - జీవితాన ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో యేసయ్య నిన్ను కొలిచేదెలా నను ఆదుకున్న నా దేవా ||ఇదే కదా||
కపటమైన లోకమందు నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా మధురమైన మమత చూపి తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు యేసయ్య నిన్ను కొలిచేదెలా నను ఆదుకున్న నా దేవా ||ఇదే కదా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
