♪♫
TG-4609
Telugu
ఇదే నాకు ఆనందము(శృంగార దేశము చేరగానే)
Idee Naaku Aanandamu(shrungaara Deeshamu Cheeragaanee)
14
views
పల్లవి
1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్ యేసుని యొద్దను నిత్యము నే నుండుట మిక్కిలి యాశ్చర్యము పల్లవి: ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము 2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతికీర్తనలు పాడుదును 3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును నా యేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము 4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతో చూచి సంతోషింతును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.