ఇదేనా న్యాయమిదియేనా కరుణామయుడు యేసు
ideenaa nyaayamidiyeenaa karunnaamayudu yeesu
🎵 TG-1724🌐 Telugu
పల్లవి
ఇదేనా న్యాయమిదియేనా కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా||
1వ చరణం
కుంటి వారికి కాళ్ళ నొసగే గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర చెడుగు యూదులు చెరను బట్టి కొరడా దెబ్బలు కసిగా గొట్టి వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ మోయలేని సిలువ మోపి గాయములను ఎన్నో చేసి నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకులెన్నో కొట్టిరయ్యో ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ఎన్ని బాధలు పెట్టిన గాని మారు పల్కడు యేసు ప్రభువు ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ఎన్ని మారులు పాపము చేసి యేసుని గాయముల్ రేపెదవేల నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల