ఇదిగో దేవా నా జీవితం
Idigo Devaa Naa Jeevitham
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో||
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో||
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.