ఇదిగో దేవుని గొర్రెపిల్లా
Idigo Devuni Gorrepillaa
ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||
పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2) సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు||
దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2) యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు||
దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2) క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.