ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను బోదు సంతోషించు(డి ||ఇదిగో నా||
యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో నా||
దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో నా||
నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ||ఇదిగో నా||
ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుఁడి ||ఇదిగో నా||
ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని ముందే చేయుదును ||ఇదిగో నా||
ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము మరువకుండుఁడి ||ఇదిగో నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.