ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో నీ||
నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో నీ||
రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో నీ||
స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో నీ||
దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో నీ||
ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో నీ||
దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో నీ||
యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో నీ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.