TG-3464
Telugu

విడిపిస్తాడు నా యేసుడు

Idipisthaadu Naa Yesudu

16
views
పల్లవి

విడిపిస్తాడు నా యేసుడు మరణపు లోయైనా నను విడువడూ (2) మనసు ఓడిపోయిననూ మనువు వాడిపోయిననూ (2) నను ఎత్తుకొనీ… నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు||

1వ చరణం

ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు||

2వ చరణం

ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు||

3వ చరణం

కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2) తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడూ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.