ఇదియే అనుకూల సమయము నీకు
Idiyee Anukoola Samayamu Neeku
ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము అను పల్లవి: ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్ 1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్ 2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్ 3. యుద్ధములు భువి జరుగుచు నున్నవి - దైవచిత్తము జరుగున్ మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును 4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్ 5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు 6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు 7. హల్లెలూయా పాడియెల్లరకు తెలుప - నెల్లరతో కూడను త్వరగా రాబోవు యేసును సంధింప - ఆయత్త పడుము వేగ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.