TG-3466
Telugu

ఇదియేనయ్య మా ప్రార్థన

Idiyenayya Maa Praarthana

18
views
పల్లవి

ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా విజ్ఞాపన ఆలకించే దేవా మము నీ ఆత్మతో నింపగ రావా (2) నీ వాక్యములో దాగియున్న ఆంతర్యమును మాకు చూపించయ్యా నీ మాటలలో పొంచియున్న మర్మాలను మాకు నేర్పించయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

1వ చరణం

నీ దృష్టిలో సరిగా జీవించే మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా నీ సృష్టిని మరిగా ప్రేమించే లోబడని మా మనసులు సరిచేయయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

2వ చరణం

నీ సువార్తను గొప్పగ చాటే బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా నీ సేవలో తప్పక కొనసాగే అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.