ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో
idugoo gorrrrelakaapari soodarulaaraa yidugoo
ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ ముదములేనివాడనై మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ హృదయుఁడనైతి ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
దూరంబునకుఁబోతిని జనకుని కృపా సారంబుఁ గొననైతిని కారు మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుఁబాసి దారి దొలగిపోతి ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
తనదు గొఱ్ఱెను జూచెను బోయఁడు తండ్రి తనశిశువును గాంచెను కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి నెమ్మది యొసంగె ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
ప్రభుయేసు నా బోయఁడు యీతఁడె భూమి నభము లేలెడి రాయఁ డు శుభమైన తనదివ్య శోణిత మొసఁగియ వ్విభుఁడు ప్రేమించి దీ వించి స్వస్థముఁజేసె ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు పచ్చిక యున్ను జీవనపూట లున్నుఁ గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి నానందముననుందు ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||
చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనముఁ గొంటిని మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం తును ముక్తి నిలయంబు ||ఇడుగో గొఱ్ఱెలకాపరి||