TG-569
Telugu

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో

ilam puchchukonuta kanna nenthoo

207
views
పల్లవి

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల ||ఇలఁ పుచ్చుకొనుట||

1వ చరణం

పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||ఇలఁ పుచ్చుకొనుట||

2వ చరణం

మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||ఇలఁ పుచ్చుకొనుట||

3వ చరణం

తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది ||ఇలఁ పుచ్చుకొనుట||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.