TG-4626
Telugu

ఇలపై ప్రభు యేసు ఇమ్మానుయేలై జన్మించె

Ilapai Prabhu Yeesu Immaanuyeelai Janminche

0
views
పల్లవి

ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె (2) హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె – మనకోసం (2) 1.  ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2) ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2) ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2) ||హల్లెలూయా||

1వ చరణం

2.  లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2) నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2) ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2) ||హల్లెలూయా||