♪♫
TG-4617
Telugu
ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయే
Immaanuyeeluni Rakthamu Nindina Ootayee
0
views
పల్లవి
1. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును పల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ 2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోముంగి మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్ 3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు విలువైన మన్నింపునొంది - పాడుదును సదా 4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్ 5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్ రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్