TG-4620
Telugu

ఇమ్ముగ నీ హృదయము నిమ్ము

Immuga Nee Hrudayamu Nimmu

0
views
పల్లవి

ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు నావలో నిను యావల జేర్చును నాథుని నామము 1.  లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు నావలో నిను యావల జేర్చును - నాథుని నామము 2.  లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే 3.  పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము 4.  శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము 5.  లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని