ఇమ్ముగ నీ సుదినంబు నుండి
Immuga Nee Sudinanbu Nundi
ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా 1. మునుపటి మందిర మహిమను మించు కడపటి మంది-ర మహిమ ఈ స్థలమందు నా సమాధానం ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా 2. అన్యజనులను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును వెండి బంగారము అన్నియు నావే దండిగ నిచ్చెద నంటివి ప్రభువా 3. ఇంపుగ తొమ్మిద-వ మాసమున ఇరువది నాల్గ-వ దినము నీ మందిర ఆ-స్థి భారమును నీ వాజ్ఞాపించి వేయించితివి 4. నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యంబుగ నా-బ్రాహాము హెబ్రోనులో గు-డారంబు వేసి కట్టెను బలిపీ-ఠము నా చోట 5. నిండు మనస్సుతో కాలేబు నిన్ను దండిగ ననుస-రించగ హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను సంభ్రముగ నొ-సంగిన దాత 6. దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మన-వి చేయ హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ 7. ఎల్లల నెల్ల విశాల పరచి కొల్లగ ప్రేమను జూపి ఎల్ల శక్తిని జూపిన ప్రభో హల్లెలూయ నీకే యేసు ప్రభో
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.