TG-3313
Telugu

ఇంకెంతకాలమని ఎంతో భారమని కలవర పడుచుంటివా

inkentakaalamani entoo bhaaramani kalavara paduchuntivaa

Blessing Kumarవిజయ్ · Vijayనిస్సై జూన్సన్ · Nissy Jhonson
0
views
Chorus

ఇంకెంతకాలమని ఎంతో భారమని కలవర పడుచుంటివా (2) మోయలేనని సాగలేనని నావల్ల కాదని కృంగియుంటివా (2) క్రీస్తేసే మనకుండగా తీరునులే నీ వ్యధలన్నీ (2) ||ఇంకెంతకాలమని||

1వ చరణం

వెలుపట పోరాటము లోపటను భయములు (2) నలుదిక్కుల నిన్ను వెంటాడినను నిన్ను తప్పించును నా యేసయ్య (2) నేస్తమా ఇంకొంత కాలమే నీ విడుదల సమీపించెను (2) ||ఇంకెంతకాలమని||

2వ చరణం

నీకున్న పగవారును సిగ్గుపడి వెనుకకు (2) త్రిప్పబడునని వాగ్దామిచ్చిన సీయోను రాజు నా యేసయ్య (2) నేస్తమా ధైర్యముగానుండుము నీ వాగ్దానము నెరవేరునులే (2) ||ఇంకెంతకాలమని||

3వ చరణం

బాధలు అధికమైన బ్రదుకే భారమైన (2) అత్యధిక విజయం నీకిచ్చునులే నిన్ను ప్రేమించిన నా యేసయ్య (2) నేస్తమా దిగులు చెందకు నీ విజయమును పొందుకొందువు (2) ||ఇంకెంతకాలమని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.