జగమంతా దివ్య కాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో
Jagamanthaa Divya Kaanthithoo Prakaashinchee Kreesthu Janmathoo
జగమంతా దివ్య కాంతితో - ప్రకాశించే క్రీస్తు జన్మతో (2) దేవుడే మానవుడై మన మధ్య నివశింప - ప్రేమానురాగాలు పంచగ ఇలలో పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప - పావనుడే ఈ భువికి వచ్చు వేళలో (2) చీకటి నిండిన పాపము పండిన - లోకమునెంతో ప్రేమించెను త్రోవ తప్పిన దేవుని విడిచిన - పాపిని ఎంతో క్షమించెను (2) లోక పాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు శిలువలో మరణించి పాపమునే తొలగించే లోకమును వెలిగింప క్రోవుత్తుల కరిగే - బ్రతుకు చీకటిని పారద్రోలేను వేవేల కాంతులతో నిండెను బ్రతుకంతా శ్రీ యేసు జన్మించగా - ఈ లోకానికే పండుగా ఆజ్ఞతిక్రమమే పాపమాయెను - నిత్య మరణానికి దారితీసేను దేవుని కృపలో క్రీస్తునందు- నిత్య జీవం అనుగ్రగించెను (2) నశించినవారిని వెదకి రక్షించుటకు అరుణోదయ తారయై ఉదయించెను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద - జీవహారమై దిగివచ్చెను మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా