జన్మించె జన్మించె
Janminche Janminche
జన్మించె జన్మించె – రారాజు జన్మించె చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దూతకు భయపడి వణికిరి గొల్లలు శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2) సంతోషముతో ఆనంద గానముతో యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా||
తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు యేసే రాజని అర్పించిరి కానుకలు (2) ఆరాధించి హృదయములను అర్పించి భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరూ వాడా||
యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము ఇదియే నిత్యము (2) మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరూ వాడా||