TG-5009
Telugu

జన్మించేను బాలుడేసు నా కొరకై ఈ భువిలో

Janmincheenu Baaludeesu Naa Korakai Ee Bhuviloo

21
views
పల్లవి

జన్మించేను బాలుడేసు నాకొరకై ఈ భువిలో (2) జగమంతా సంతోషం మనసంతా ఉల్లాసం (2) ఆయెను ||జన్మించేను||

1వ చరణం

రాజుల రాజువై యేసు ప్రభువుల ప్రభువై మానవ రూపమునెత్తెను భువిపైన (2) మన పాపములను పరిహరింపను రారాజుండగు ప్రభుయేసు మనకై పుట్టెను ||జన్మించేను||

2వ చరణం

స్తుతులకు పాత్రుడా నీవే ఘనతకు అర్హుడా నీదు పరలోక మహిమను విడచితివా (2) దివ్య రక్షకుడు వెలుగునియ్యను నిత్యజీవమును అనుగ్రహించుటకు వచ్చెను ||జన్మించేను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.