TG-5007
Telugu

జన్మించెనే అవతరించెనే ఈ లోకరక్షకుండు

Janminchenee Avatharinchenee Ee Lookarakshakundu

0
views
పల్లవి

జన్మించెనే అవతరించెనే (2) ఈ లోకరక్షకుండు మన పాప విమోచకుడు దావీదు పురమునందు ఆ బెత్లహేమునందు హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్ మేరీ... మేరీ... క్రిస్మస్ (4) ||జన్మించెనే||

1వ చరణం

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సైన్యములకధిపతి సమాధాన కర్తయై ఇమ్మానుయేలన బడిన రాజు పుట్టెను బెత్లహేములో... దావీదు పురములో.... (2) హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్ మేరీ... మేరీ... క్రిస్మస్ (4) ||జన్మించెనే||

2వ చరణం

అంధకార బ్రతుకులో వెలుగు నింపు జ్యోతిగా అధముడైన మనిషికై పరమాత్ముడొచెను తండ్రి మనసు తెలుపను సిలువ ప్రేమ చూపను సర్వమానవాళికై క్రీస్తేసు పుట్టెను బెత్లహేములో... దావీదు పురములో... (2) హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్ మేరీ... మేరీ... క్రిస్మస్ (4) ||జన్మించెనే||