TG-5006
Telugu

జన్మించెను రక్షకుడు మన కొరకు దిగి వచ్చెను యేసయ్య భువి వరకు

Janminchenu Rakshakudu Mana Koraku Digi Vachchenu Yeesayya Bhuvi Varaku

18
views
పల్లవి

జన్మించెను రక్షకుడు మన కొరకు దిగి వచ్చెను యేసయ్య భువి వరకు (2) మలినమైన మనుషుల కోసం చేజారిన లోకం కోసం మన చీకటి బ్రతుకుల కోసం చిగురించే ఆశల కోసం Happy Happy Christmas Merry merry christmas (2) చ:  వాక్యనుసారము జరిగించుటకు తన తండ్రి మాటలను నెరవేర్చుటకు (2) రాజుల కే రాజుగా జ్ఞానులకే జ్ఞానిగా (2) ఈ లోకమునకు ఏతెంచెను యేసు ఈ లోక రక్షకునిగా ఉదయించెను ||Happy||

1వ చరణం

న్యాయమును జరిగించుటకు వ్యాధి బాధలను తొలగించుటకు (2) ఆదరణ కర్తగా అందరికీ ప్రభువుగా (2) ఈ లోకమునకు ఏతెంచెను యేసు ఈ లోక రక్షకునిగా ఉదయించెను ||Happy||

2వ చరణం

తన తండ్రి ప్రేమ ను ప్రకటించుటకు ఈ లోక పాపమును తొలగించుటకు (2) మహిమ గల వ్యక్తిగా మహోన్నత శక్తిగా (2) ఈ లోకమునకు ఏతెంచెను యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను ||Happy||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.