జను లందఱు వినండి దివ్య

janu landarru vinandi divya

🎵 TG-311💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జను లందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||జను లందఱు||

1వ చరణం

నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను. ||జను లందఱు||

2వ చరణం

మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్. ||జను లందఱు||

3వ చరణం

ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు. ||జను లందఱు||

4వ చరణం

పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినఁగాను బాధ తీఱును. ||జను లందఱు||

5వ చరణం

చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ముఁ బిల్చును ||జను లందఱు||

Report Error