♪♫
TG-2128
Telugu
జయం జయం మన యేసుకే
jayam jayam mana yeesukee
78
views
పల్లవి
జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే (2) స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము పునరుత్ధానుడైన క్రీస్తుని మహిమపరచెదము (2) ||జయం||
1వ చరణం
పాపములేని యేసుడు సిలువలో పాపికై మరణించి మూడవదినమున – తిరిగి లేచెను మరణపు ముల్లును విరిచెను పాపము చేసి మానవుడు కోల్పోయిన అధికారమును సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను సాతాను బలమును గెలిచెను పాపము విడిచి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము పునరుత్ధాన శక్తితో నింపి పరలోకమునకు చేర్చును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.