జయమని పాడెదము యేసుని చాటెదము (68)
Jayamani Paadedamu Yeesuni Chaatedamu (68)
- డా.వై.బాబ్జీ - Scale : G జయమని పాడెదము - యేసుని చాటెదము లోకమునంతటిని - ప్రేమతో గెలిచెదము యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని - పాపుల రక్షకుడని ||జయ||
1. నరరూపధారియై - భువి నుదయించెను నరులను రక్షింప - మరణము నొందెను మూడవ దినమున - మృత్యుంజయుడాయెన్ ముదమున పాడెదము - హల్లెలూయగీతముల్ ||జయ||
2. నూతన సృష్టిగా - మనలను చేసెను నూతన గీతమున్ - మన నోట నుంచెను పరిశుద్ధాత్ముని - వరముగ నొసగెను పాడి పొగెడెదము - ప్రభువును మనసార ||జయ||
3. శుభప్రద నిరీక్షణ - మరి మనకొసగెను శుభవార్త ప్రకటించే - శిష్యులుగ చేసెను అభయప్రదాతయై - మనతో నుండెను అనిశము పొగడెదము - అరమరికలు లేక ||జయ||
జయమని పాడెదము - యేసుని చాటెదము లోకమునంతటిని - ప్రేమతో గెలిచెదము యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని - పాపుల రక్షకుడని ||జయ||