♪♫
TG-3501
Telugu
జయమిచ్చిన దేవునికి
Jayamichchina Devuniki
19
views
పల్లవి
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం జీవింప చేసిన రాజా నిన్నే జీవితమంతా స్తుతింతున్ (2) హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2) నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2) నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన||
1వ చరణం
నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2) కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన||
2వ చరణం
అద్భుతకరుడవు సృష్టికర్తవు (2) యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన||
3వ చరణం
సత్య దేవుడు కరుణా శీలుడు (2) నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన||
4వ చరణం
యేసే నా రక్షణ నాదు ఆశ్రయం (2) నా నిరీక్షణ… యేసు నాయకుడే (2) ||జయమిచ్చిన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.