జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ

jayaprabhu yeesune venbadinchuchu jayamuga

🎵 TG-462💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు యేసునె||

1వ చరణం

ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ ||జయప్రభు యేసునె||

2వ చరణం

ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో ||జయప్రభు యేసునె||

3వ చరణం

మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును యీ కృపాదినమున ||జయప్రభు యేసునె||

4వ చరణం

మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు ||జయప్రభు యేసునె||

5వ చరణం

ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని గొలువగ ||జయప్రభు యేసునె||

Report Error