జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
jayasheeludaa maa yeesayyaa jeevinchu vaadaa messayyaa
జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం ఆ...ఆ..ఆ...ఆ...హల్లెలుయా (2) ఆ.........హల్లెలూయా
బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా తృప్తినిచ్చు వాడా తనయులకు - ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా మాకై మరల రానుంటివా - యేసు (2) ||జయశీలుడా మా||
ఆదియు అంతము నీవేగా - ఆరాద్యుండవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా - ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిశం నిన్నే కీర్తింతును - యేసు (2) ||జయశీలుడా మా||
నీవే దిక్కని నమ్మితిని - నిన్నే గురిగా ఎంచితిని నీవే మాకు తండ్రివి - నీకు సమస్తము సాద్యమే నీపై సర్వం మోపితిని - యేసు (2) ||జయశీలుడా మా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.