TG-398
Telugu

జీవమా చింతించకుండు నిన్నుఁ గావ

jeevamaa chinthinchakundu ninnum gaava

199
views
పల్లవి

జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి ||జీవమా చింతించకుండు||

1వ చరణం

గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు పెంచు ని న్నత డు ||జీవమా చింతించకుండు||

2వ చరణం

పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి ||జీవమా చింతించకుండు||

3వ చరణం

మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి నిన్నేలునతడు ||జీవమా చింతించకుండు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.