TG-493
Telugu

జీవము పోవగన్ దేవుని సన్నిధి

jeevamu poovagan deevuni sannidhi

199
views
పల్లవి

జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||

1వ చరణం

పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్ ||జీవము పోవగన్||

2వ చరణం

నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్ ||జీవము పోవగన్||

3వ చరణం

నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును ||జీవము పోవగన్||

4వ చరణం

పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా ||జీవము పోవగన్||

5వ చరణం

యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము చేయున్ ||జీవము పోవగన్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.