♪♫
TG-1943
Telugu
జీవన తొలి సంధ్య నీతోనే
jeevana tholi sandhya neethoonee
79
views
పల్లవి
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన||
1వ చరణం
నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను దేవా నీవే నా ఆశ్రయ దుర్గము నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా దేవా నను నీ సాక్షిగ నిల్పుమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.