జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే
jeevinchuchunnaavanna peeru unnadi mruthudavee
🎵 TG-2397🌐 Telugu
పల్లవి
జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే (2) ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు||
1వ చరణం
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు నులివెచ్చని స్థితి ఏల సోదరా నులివెచ్చని స్థితి ఏల సోదరీ నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు||
2వ చరణం
అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2) ||జీవించు||
3వ చరణం
ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా దొంగ వలె వచ్చెదనని అన్నాడు గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా అంతము వరకు నిలిచి యుండుమా (2) ||జీవించు||