జీవింతు నేన
Jeevinthu Nenu
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2) నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును (2) ||జీవింతు||
నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును (2) నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు||
శ్రమయైనా బాధైననూ – హింసయైనా కరువైనా ఎదురైననూ ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా ఎతైనా లోతైననూ (2) నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి నేను విడిపోదునా ప్రభు నీడనుండి జీవింతును – నా యేసుతో జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.