జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా

jeevitha yaathraloo naadu guri neevegaa - neeku saatiyevvaru yeesuvaa

🎵 TG-1062🌐 Telugu
పల్లవి

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా ||జీవిత||

1వ చరణం

నన్ను నడిపించు చుక్కాని నీవేకదా - నీవేకదా నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా - నీవేకదా నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా ||జీవిత||

2వ చరణం

నాకు నిరతంబు మధిలోన నీద్యానమే - నీద్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే - నీ గానమే నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా ||జీవిత||

Report Error