♪♫
185
views
పల్లవి
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము వరకు||
1వ చరణం
ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము వరకు||
2వ చరణం
అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాంతము వరకు||
3వ చరణం
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము వరకు||
4వ చరణం
నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము వరకు||
5వ చరణం
మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాంతము వరకు||
6వ చరణం
పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము వరకు||