TG-3513
Telugu

జీవితమంతా నీ ప్రేమ గాన

Jeevithamanthaa Nee Prema

13
views
పల్లవి

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2) సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2) మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

1వ చరణం

సృష్టినంతటిని నీ మాట చేత సృజియించితివిగా మా దేవ దేవా (2) నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

2వ చరణం

కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2) కల్వరి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.