♪♫
TG-3516
Telugu
జుంటె తేనె ధారల
Junte Thene Dhaarala
0
views
పల్లవి
జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||
1వ చరణం
యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||
2వ చరణం
యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె||
3వ చరణం
యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి (2) నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||