జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే

jyoothirmayudaa - naa praanna priyudaa - sthuthi mahimalu neekee

🎵 TG-1064🌐 Telugu
పల్లవి

జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే ..... నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... (2) || జ్యోతి||

1వ చరణం

నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా ||జ్యోతిర్మయుడా -||

2వ చరణం

నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా ||జ్యోతిర్మయుడా -||

3వ చరణం

నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద ||జ్యోతిర్మయుడా -||

Report Error