TG-1746
Telugu

కావలెనా యేసయ్య బహుమానము (మరి

kaavalenaa yeesayya bahumaanamu (mari

53
views
పల్లవి

కావలెనా యేసయ్య బహుమానము (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా||

1వ చరణం

నీనెవె పట్టణము యెహోవా దృష్టికి ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి నీనెవెకు పంపెను – కనికరము చూపించెను ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా ఆగింది యెహోవా శాపము కురిసింది కరుణ వర్షము దేవుని ప్రజలను నశియింప చేయుటకు దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి అణిగింది హామాను గర్వము జరిగింది దేవుని చిత్తము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.