TG-3528
Telugu

కలలాంటి బ్రతుకు నాది

Kalalaanti Brathuku Naadi

0
views
పల్లవి

కలలాంటి బ్రతుకు నాది కన్నీటి ఊట నాది (2) కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం కల్వరిలో సిలువ త్యాగ బంధం (2) ||కలలాంటి||

1వ చరణం

నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమియించలేరే నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా ధన్యునిగా నను మార్చినావే (2) ||కలలాంటి||

2వ చరణం

నేనేమిటో నా విలువేమిటో తెలియకనే తిరుగాడినానే నీవేమిటో నీ ప్రేమేమిటో ఎరుగక నిను నే ఎదిరించినానే హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా దీవెనగా నను మార్చినావే (2) ||కలలాంటి||