TG-1759
Telugu

కలలాంటి బ్రతుకు నాది కన్నీటి

kalalaanti brathuku naadi kanneeti

77
views
పల్లవి

కలలాంటి బ్రతుకు నాది కన్నీటి ఊట నాది (2) కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం కల్వరిలో సిలువ త్యాగ బంధం (2) ||కలలాంటి||

1వ చరణం

నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమియించలేరే నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా ధన్యునిగా నను మార్చినావే (2) ||కలలాంటి||

2వ చరణం

నేనేమిటో నా విలువేమిటో తెలియకనే తిరుగాడినానే నీవేమిటో నీ ప్రేమేమిటో ఎరుగక నిను నే ఎదిరించినానే హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా దీవెనగా నను మార్చినావే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.