కలతలతో నిండినా కల చెదరిపోయినా
Kalathalathoo Nindinaa Kala Chedaripooyinaa
కలతలతో నిండినా - కల చెదరిపోయినా కన్నీరే మిగిలినా - కలవరపడకు శత్రువులే తరిమినా - నీ వారే గెంటినా అంతా కోల్పోయినా - కలవరపడకు (2) నమ్మదగిన దేవుడు - యేసయ్యేగా ఆదరించె నాధుడు - ఆ ప్రభువేగా (2) దిగులు చెందకు - భయమునొందక (2) ||కలతలతో||
నీ కష్టము నీ నష్టము - ఎరుగకుండనే సూటిపోటి మాటలతో - గాయపరచిరా నీకంటూ విలువన్నది - ఇవ్వకుండనే నీ జ్ఞానము వెర్రిదని - త్రోసివేసిరా (2) దేవుడే చూసాడు - నీ నిందలను ఆయనే తీర్చును - నీ బాధలను (2) ||నమ్మదగిన||
ఈ భారము ఈ బంధము - మోయలేనని మరణానికి మార్గమును - ఎంచుకుంటివా కలకాలము జీవించే - తోడు లేదని గతమంతా తలచుకొని - కుమిలిపోతివా (2) యేసే నీ తోడై - నడిపిస్తాడమ్మా ప్రేమతో నిన్ను - చేరదీస్తాడమ్మా (2) ||నమ్మదగిన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.