♪♫
TG-3532
Telugu
కళ్ళల్లో కన్నీరెందుకు
Kallallo Kanneerenduku
15
views
పల్లవి
కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
1వ చరణం
హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
2వ చరణం
కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.